![]() |
| రుచికరమైన ఆహారం |
ఎంత ప్రీతీ అంటే కొందఱు సంపాదనా(స్వార్థ) పరులు తమ పనులు నెరవేర్చు కోవడానికి లంచాలకు లొంగని అధికారులను, ఇతరులను పొగడ్తలతో, వారికిష్టమైన తిండితో తమ దారికి తెచ్చుకోవడం మనకు తెలిసిందే.
జానెడు పొట్ట కోసం ఎన్ని కష్టాలని పాత కాలం వాళ్ళు వాపోయేవారు. మధ్య తరగతి, ఉన్నత తరగతికి (ఆర్థిక పరంగా) చెందిన వారికి ఇప్పట్లో తిండికి ఇబ్బందులు లేవు, పరుగంతా ఇల్లు, కార్లు, బంగారం, అంతస్తు, హోదా వంటి వాటి కోసమే.
శరీరానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి అవి మన ఆర్థిక,సామాజిక, నైతిక విలువలకు అతీతమైనవి. పేరుకు మనం భారతీయులం, మన సంస్కృతిని, వేదాంతాన్ని మరచి పోతున్నాము. ఎందరో మునులు, ఋషులు,యోగులు తపస్సు/ధ్యానం లో కలిగిన అంతః జ్ఞానం ద్వారా మానవునికి 5 కోశాలు (ఒరలు) ఉన్నాయని తెలిపారు, అవి;
![]() |
| ప్రాణమయ కోశంలో మన ఆధ్యాత్మిక పురోగతిని తెలిపే షట్ చక్రాలు |
1. అన్నమయ కోశం (కన్పించే శరీరం)
2. ప్రాణమయ కోశం (ప్రాణ,ఉదాన, వ్యాన సమాన, అపానల "శక్తి")
3. మనోమయ కోశం (కోరికలు, పోటీలు, ఆశలు, అత్యాశలతో చంచలమైనది)
4. విజ్ఞానమయ కోశం (సత్వ గుణంతో మంచి చెడు విచక్షణ చేసేది)
5. ఆనందమయ కోశం (సత్వం సత్వాతీతం అయినప్పుడు ఉన్నతమైన, దివ్యానంధాని కోరుతుంది)
ఇది చాలా పెద్ద సబ్జెక్టు, కాస్తా తీరికగా దీన్ని గురించి వ్రాస్తాను, ప్రస్తుతం అన్నమయ కోశాన్ని పలు రోగాలకు గురి చేస్తున్న నూనె గురించి కొనసాగిస్తాను.
![]() |
| ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం |
ఆరోగ్యం కోసం ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటివి తీసుకోవాలని వైద్యులు, ఆరోగ్య సలహాదార్లు చెప్పడం రివాజు. మనలో చాల మందికి ఈ విషయం తెలుసు. అయితే ఆరోగ్యాన్ని పాడు చేసే వాటి గురించి మాత్రం సరిగా తెలియదు.
- ఆల్కాహాలు కొందరే తీసుకుంటారు, అతిగా త్రాగితే లివరు ఆరోగ్యం దెబ్బ తింటుంది.
- సిగరెట్లు కూడా మోతాదు మించితే లంగ్స్, గుండె, నరాల ఆరోగ్యం క్షీణిస్తుంది.
- పాన్, గుట్కాలు చివరకు కేన్సరుకు కూడా దారితీస్తాయి.
అయితే ఇవి అనారోగ్యకరమైనవని అందరికి తెలుసు, అందుకే అనేకులు వీటికి దూరంగా ఉంటున్నారు.
![]() |
| రుచినిచ్చి ఆరోగ్యాన్ని హరించే నూనె |
నూనె విషయం అలా కాదు, ప్రతి నిత్యం, ప్రతి ఇంటా, ప్రతి హోటళ్ళలో విరివిగా ఉపయోగించేది నూనె. అనారోగ్య వస్తువని అనలేము, ఎంత మోతాదో సరిగా ఎవరూ చెప్పరు. పైగా మా బ్రాండు చాల శ్రేష్టం, మాది మీ గుండెకు మంచిదని పేపర్లలో, టివిలలో నొరూరిచే వంటలతో ప్రకటనలు.
ఇంకేముంది "గుండెకు ఫ్రెండంట" అని నెలకు లీటర్ల కొద్దీ నూనెలు వాడేస్తున్నారు. నూనె ఎంత వేస్తే అంత రుచి వచ్చె, ఇంటిలో అందరూ కడుపు నిండా తింటారు, వంట చేసినమ్మకూ సంతోషం.
పాత కాలం వలె ఇంటిలో ఎవరికీ తగిన శారీరక శ్రమ లేకపోయే, శ్రమిస్తే ఆకలి వేస్తుంది, ఆకలి రుచి ఎరుగదు, అప్పుడు పప్పన్నము, రాగి సంగటి కూడా కడుపు నిండా తింటాము, ఆరోగ్యంగా ఉంటాము.
ఉద్యోగం, వ్యాపారం, చదువుల పేరిట, టీవీ, సెల్లు, కంపూటర్ వలన శారీరక శ్రమకు అవకాశమే లేదు, శ్రమైక జీవన సౌందర్యం అంటే ఏమిటో తెలియదు. టీవీ, సెల్లుల వలె స్థూలకాయం, రక్త పోటు, షుగర్, ఆయాసం, అల్లర్జీలు మన ఇంటి శాశ్విత అతిధులు, త్వరగా తగ్గాలని ఇంగ్లీషు డాక్టర్ దగ్గరకు వెళితే, మన టోకెన్ వచ్చాక 2 నిమిషాలలో మందుల లిస్టు రెడీ, వారికి ఆహారం గురించి చెప్పే తీరిక లేదు, మనకు మంచి ఆహారపు అలవాట్లు చేసుకునే ఆసక్తి లేదు.
![]() |
| గుండె ఆరోగ్యానికి 'వేదం" వంటిది ఈ శాస్త్రీయ గ్రంధం |
గుండె జబ్బులకు శాస్త్రీయ కారణాలతో Dr. Dean Ornish వ్రాసిన పుస్తకం అనేక ప్రాంతీయ బాషలలో కూడా లభిస్తుంది, అనేక జబ్బులకు ప్రధాన కారణం నూనేనని అయన నిరూపించారు, సర్జరీ లేకుండానే గుండె జబ్బులను నయం చేసు కావచ్చునని అయన శిష్యవైధ్యులు అనేక పట్టణాలలో శిక్షణ ఇచ్చారు, ఆ కీలక అంశం "నూనె లేకుండా వంటలు తాయారు చేయడం".
నెలకు సగటున మనిషికి 100 నుంచి 150 గ్రాముల నూనె ఆరోగ్యకరమని Dr. Dean Ornish సెలవిచ్చారు. మనమేమో అంతకు పది రెట్లు నూనె వాడుతూ జబ్బులు రాకుండా వుండాలని దురాశ పడుతున్నాము. నిజాలు చేదుగానే వుంటాయి, అయితే ఆరోగ్యాన్ని ఇస్తాయి.
రుషి ప్రచురణలు డాక్టర్ బిమల్ చాజేర్ వ్రాసిన పుస్తకాన్ని "గుండె వ్యాధి నుండి విముక్తి" పేర ప్రచురించారు, ఇదయితే వంట ఇంటి అధిపతులు కూడా చదివి అర్థం చేసుకోగలరు. మన ఇంటి మహిళకు ఆరోగ్యం గురించి సరైన అవగాహన ఏర్పడితే మన మంతా ఆరోగ్యవంతులవుతాము.
నెలకు ఇంటికంతా కలిపి 1 లేదా 2 లితర్లకు నూనెను పరిమితం చేసి చూడండి, ఎంత ఆరోగ్యం మీ ఇంట వెళ్లి విరుస్తుందో అనుభవం అవుతుంది, 4, 5 లీటర్ల నూనె డబ్బే కాదు, డాక్టర్ల బిల్లు, మందుల గొడవ కచ్చితంగా తగ్గుతాయి, మిగిలిన ఈ డబ్బులో కొంత పేదలకో, అనాధ శరణాలయాలకో, వ్రుద్దాశ్రమాలకో ఇవ్వండి ఒక మంచి పని చేశామన్న సంతోషం, పుణ్యము కలుగుతుంది.
నూనెకు ఆరోగ్యానికి ఏమి లింకు లేదని భావిస్తుంటే ఒక నెల రెండింతల నూనె వాడి చుడండి, అప్పుడు సత్యాసత్యాలు మీకే తెలుస్తాయి. ఉప్పు ఎక్కువైతే తినలేము, నూనె ఎక్కువైతే మరింత తింటారు, అందుకే ఉప్పు కంటే నూనె ముప్పని మీరు మనసు లోలోతులలో గాడంగా విశ్వసించిన రోజే ఇంటి వంటల్లో మార్పు వస్తుంది, కుటుంబ ఆరోగ్యం తప్పకుండా మెరుగవుతుంది.
మీకందరికీ ఆరోగ్యము, సంతోషం, సంతృప్తి, ప్రశాంతత & దివ్యానందం చేకూరాలని ఆశిస్తూ,
- డాక్టర్ ఆర్. యస్. ఈశ్వర్ రెడ్డి, డాక్టర్ పి. వాణి & డాక్టర్ పి. రాధాక్రిష్ణ మోహన్.






No comments:
Post a Comment